: ఆగని ఆధిపత్య పోరు... నంద్యాలలో భూమా, శిల్పా వర్గీయుల కొట్లాట


నంద్యాల కేంద్రంగా సాగుతున్న తెలుగుదేశం నేతల ఆధిపత్య పోరు ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీఎం చంద్రబాబు కల్పించుకుని నేతలతో మాట్లాడి, వారి మధ్య సయోధ్యకు మంత్రి అచ్చెన్నాయుడిని నియమించినా ప్రయోజనం లేకపోతోంది. ఈ ఉదయం శిల్పా మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి వర్గీయులు మరోసారి బాహాబాహీకి దిగారు. నంద్యాలలోని దేవనగర్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరు నేతల వర్గాలూ పరస్పరం ఎదురవుతాయన్న సంగతిని ముందే గమనించిన పోలీసులు గొడవ పెద్దది కాకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. స్వల్ప లాఠీ చార్జ్ జరిపి ఇరు వర్గాలనూ చెదరగొట్టారు. కాగా, ఆక్రమణల తొలగింపు విషయమై రెండు వార్గాల మధ్యా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో, ఓ బ్యానర్ కట్టే విషయంలో రభస మొదలైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News