: హైదరాబాద్‌లో చిన్నారిపై దుశ్చర్య.. ఫేస్‌బుక్ పోస్ట్‌ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన క‌ర్క‌శ‌త్వం


హైదరాబాద్‌లో ఓ వ్య‌క్తి ఇటీవ‌ల చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా కొంద‌రు వ్య‌క్తులు అభం శుభం తెలియ‌ని చిన్నారుల‌పై చేస్తోన్న దుశ్చ‌ర్య‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. కొంద‌రు దుండ‌గులు మూడేళ్ల‌ ఓ బాబును ఒంటిపై దుస్తులు లేకుండా కర్ర స్తంభానికి కట్టేశారు. దీనిని గ‌మ‌నించిన‌ మర్రిపాటి శ్రీనివాసులు అనే వ్యక్తి త‌న మొబైల్‌లో ఆ చిన్నారిని ఫొటో తీసి, అనంత‌రం త‌న‌ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. స‌ద‌రు చిన్నారి భిక్షాటన చేయడానికి ఒప్పుకోలేద‌ని, అందుకే ప‌లువురు ఆ బాలుడిప‌ట్ల క‌ర్క‌శ‌త్వంగా ప్ర‌వ‌ర్తించార‌ని పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఫేస్‌బుక్‌లో 7 వేల‌కు పైగా లైకులు, దాదాపు 4000 కామెంట్లు, 49 వేలకు పైగా షేర్లు వ‌చ్చాయి. చివ‌రికి ఇది బాలల హక్కుల సంఘం వ‌ద్ద‌కు చేరింది. వారు డీజీపీ అనురాగ్‌శర్మకు ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేశారు. బాలుడిని వారి బారి నుంచి కాపాడి, ఇటువంటి ఘ‌ట‌న‌కు పాల్ప‌డుతున్న వారిని కఠినంగా శిక్షించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టుపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News