: విమానంలో మంటలు...ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పల్లె రఘునాథరెడ్డి


ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ప్రఖ్యాత గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంత్యక్రియల్లో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా పాల్గొనేందుకు పల్లె రఘునాథరెడ్డి ఈ రోజు చెన్నై వెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొన్న పల్లె ఆ కార్యక్రమాలు ముగిసిన అనంతరం స్పైస్ జెట్ విమానంలో హైదరాబాదుకు బయల్దేరారు. టేకాఫ్ సమయంలో ఈ విమానానికి మంటలు అంటుకున్నాయి. దానిని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని ఆపేశారు. క్షణాల్లో చుట్టుముట్టిన ఫైరింజన్లు మంటలను ఆర్పేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News