: ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీ


హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కాన్వాయ్ లోని కార్లకు ప్రమాదం తప్పింది. హిందూపురం మండలం కోడికొండ చెక్ పోస్ట్ సమీపంలో కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొనడంతో స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే, కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కాగా, ఈ ఏడాది జూన్ లో బెంగళూరు సమీపంలో బాలయ్య కాన్వాయ్ లోని ఒక వాహనం బోల్తా కొట్టింది.

  • Loading...

More Telugu News