: నీతా అంబానీ సోదరి ఉర్జిత్ పటేల్ కు భార్య అంటూ సోషల్ మీడియాలో వదంతులు?
పెద్దనోట్ల రద్దు విషయం ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి ముందే తెలుసనే వదంతులు హల్ చల్ చేస్తున్న విషయం విదితమే. దీంతో పాటు, మరో వార్త కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు వివాహమైందని, నీతా అంబానీ సోదరి అయిన మమతా దలాల్ ఆయన భార్య అని వదంతులు వ్యాపించాయి. ఈ బంధుత్వం కారణంగానే పెద్దనోట్ల మార్పిడి విషయాన్ని ముఖేశ్ అంబానీకి ముందుగానే చేరవేశారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఇదంతా పుకార్లు మాత్రమేనని అంటున్నారు. కాగా, నీతా సోదరి మమతాదలాల్ తండ్రి రవీంద్రభాయ్ దలాల్ 2014లో మృతి చెందారు. బాంద్రాలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్ లో మమతాదలాల్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మరోపక్క, ఉర్జిత్ పెళ్లి విషయమై ‘క్వింట్’లో కూడా ఒక కథనం వెలువడింది. ఉర్జిత్ భార్య కనన్ పటేల్ అని, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే, యాభై మూడు సంవత్సరాల ఉర్జిట్ పటేల్ బ్రహ్మచారి అన్నది ఆయన ప్రొఫైల్ లో ఇస్తున్నారు.