: ఎయిరిండియా విమానంలో మహిళపై వేధింపులు... ఐదుగురి అరెస్టు


ఎయిరిండియా విమానంలో మహిళ వేధింపులు ఎదుర్కొనడం కలకలం రేపుతోంది. ఎయిరిండియాకు సంబంధించిన 301 రకానికి చెందిన విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి బయల్దేరింది. మార్గమధ్యంలో ఐదుగురు వ్యక్తులు తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగని వారు, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె కేబిన్ క్రూకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎయిరిండియా సిబ్బంది కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయడంతో... విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే మహిళపై వేధింపులకు పాల్పడిన ఐదుగురిపై భద్రతాధికారులు ఎయిర్‌ క్రాప్ట్ యాక్ట్ 22 కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News