: 1.37 కోట్ల నోట్లతో డిపాజిట్ వ్యాన్ డ్రైవర్ పరారీ
పెద్ద నోట్ల రద్దుతో దేశాన్ని కరెన్సీ కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో ముద్రించిన నోట్లను సరఫరా చేస్తూ ఆర్బీఐ బిజీగా ఉంది. ఆర్బీఐ పంపించిన నోట్లను ఖాతాదారులకు అందజేస్తూ బ్యాంకులు బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వెళ్లిన ఓ సెక్యూరిటీ వ్యాన్ డ్రైవర్ 1.37 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. ఏటీఎంలో పెట్టేందుకు వెళ్తూ... వ్యాన్ తో సహా పరారయ్యాడు. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వ్యాన్ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.