: కేసీఆర్ కు ఘాటుగా లేఖ రాసిన రేవంత్ రెడ్డి!
_1447.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలపై సీఎంను ప్రశ్నించారు. లేఖలో ఆయన ఏమన్నారంటే... పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. హైదరాబాదులో లక్ష ఇళ్లు కడతామని హామీ ఇచ్చిన మీరు, ఇంతవరకు కేవలం 969 ఇళ్లు మాత్రమే కట్టారని ఆయన చెప్పారు. ఇళ్ల నిర్మాణంపై ప్రశ్నిస్తే నిధులు లేవని సాకులు చెబుతున్న ప్రభుత్వం, 200 కోట్ల రూపాయలతో సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఎలా నిర్మించాలనుకుంటోందని, మరో 1200 కోట్ల రూపాయలతో కొత్త సచివాలయం కడతామని ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు. క్రిస్టియన్ భవన్, కుమ్రం భీం భవన్, ఆదివాసీ భవన్, బంజారా భవన్ లు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, రెండేళ్లయినా నిర్మాణం మొదలు కాలేదని ఆయన విమర్శించారు. శిలాఫలకాలకే పరిమితమైన భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.