: అసెంబ్లీలో నడుమంతా ఊపేస్తుంది... ఆమె నోటి నుంచి రేప్ తప్ప మరో మాట రాదు!: రోజాపై సోమిరెడ్డి వ్యాఖ్యలు


వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా నోటి నుంచి రేప్ అనే మాట తప్ప మరే మాట రాదని మండిపడ్డారు. రోజాపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే విందాం. "శాసనసభలోకి జబర్దస్త్ కార్యక్రమంలో ఉండే ఆమె వస్తుంది, రాగానే నడుమంతా ఊపేస్తుంది... ఏందమ్మా ఇది? అని ఎవరైనా అడిగితే, తెలుగుదేశంలో ఎవడన్నా ఒక్కడైనా ఉన్నాడా? అని అడుగుతుంది. ఆమె మాటలకు అందరూ భయపడి చంద్రబాబు వెనకకు చేరారు. ఆ తర్వాత, 'మేమంతా ఎందుకమ్మా?' అని ఓ ఎమ్మెల్యే అడిగితే రేప్ చేస్తావా? అని ప్రశ్నించింది. దీంతో, అక్కడున్న వారంతా భయపడిపోయారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్లు ఆమెను చుట్టుముట్టారు. ఏందమ్మా ఏంది, నీవు మాట్లాడింది? అని ఓ రిపోర్టర్ అడిగితే, ఏం నువ్వు రేప్ చేస్తావా? అని ప్రశ్నించింది. దాంతో రిపోర్టర్ కూడా భయపడిపోయాడు. ఈ రాష్ట్ర 70 ఏళ్ల చరిత్రలో ఒక ఆడమనిషి, ఒక లెజిస్లేటర్ మిగతా లెజిస్టేటర్లను పట్టుకుని రేప్ చేసే మొగాడు ఉన్నాడా? అని ప్రశ్నించడం ఎప్పుడైనా చూశామా? పంచాయతీ మీటింగుల్లో వార్డు మెంబర్లు కూడా ఇలాంటి భాష మాట్లాడరు" అని సోమిరెడ్డి ఘాటుగా చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జన చైతన్య యాత్రను ప్రారంభించిన సందర్భంగా సోమిరెడ్డి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News