: చిల్లర కష్టాలు మరింత పెరగనున్నాయి: సీఎం మమతా బెనర్జీ


కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్ర‌జ‌లు కేంద్ర స‌ర్కారుపై తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవ‌ని హెచ్చరించారు. పెద్ద‌నోట్ల‌ రద్దుతో ప్రజలు ఎన్నో క‌ష్టాలు పడుతున్నారని ఆమె అన్నారు. చిల్లర కష్టాలు మరింత అధిక‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. న‌ల్ల‌కుబేరులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న న‌గ‌దును తీసుకురాలేక‌పోతోన్న‌ కేంద్ర ప్ర‌భుత్వం.. దేశంలోని ప్రజలను మాత్రం ఈ విధంగా దోచుకుంటోంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. మోదీ స‌ర్కారు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News