: మగశిశువుని రూ.21 లక్షలకు, ఆడశిశువుని రూ.లక్షకు అమ్మేస్తున్న ఆసుపత్రులు
మూడు సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ లోని సోహన్ నర్సింగ్ హోం, సుబోధ్ మెమోరియల్ ట్రస్ట్‌లలో జరుగుతున్న దారుణ ఘటన ఇటీవలే వెలుగులోకొచ్చింది. అప్పుడే పుట్టిన పసికందుల్ని బిస్కెట్ డబ్బాల్లో ఉంచి ఆసుపత్రి యాజమాన్యాలు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నాయి. తమ ఆసుపత్రుల్లో కాన్పుకోసం వచ్చిన మహిళలు, వారి బంధువులకు.. శిశువు పుట్టగానే చనిపోయిందని చెప్పి నమ్మిస్తూ ఆసుపత్రి సిబ్బంది ఈ రాకెట్ నడుపుతున్నారు. ఆ తరువాత వారిని డబ్బాల్లో ఉంచి వేరే ప్రాంతాలకు తరలించి అమ్మేస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సీఐడీ అధికారులు ఆ ఆసుపత్రిపై దాడులు చేసిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురు శిశువులని బిస్కెట్ కంటైనర్లరో ఉంచిన ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మగ శిశువుని రూ.21 లక్షలకు, ఆడశిశువుని లక్ష రూపాయలకు అమ్మేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.