: సంగీత దర్శకుడుని ఆట పట్టించిన సమంత సరదా ట్వీట్ అదుర్స్!
‘కొలవెరీ’ పాటతో పాప్యులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ను కథానాయిక సమంత ఆట పట్టించింది. ఆ వివరాల్లోకి వెళితే, తనకు నిశ్చితార్థం అయినట్లు వస్తోన్న వదంతులను తన అభిమానులు నమ్మకూడదని, అదంతా అసత్యమేనని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అసలు తనకు నిశ్చితార్థం జరగడమేంటని, తాను సింగిల్‌గానే ఉన్నానని, తానింకా చిన్నవాడినేనని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ ట్వీట్‌పై చెన్నయ్ బ్యూటీ సమంత స్పందిస్తూ సరదాగా రిప్లై ఇచ్చింది. ‘కానీ ఆమె చాలా మంచి అమ్మాయి కదా.. మరి ఏమైంది?’ అంటూ ఆమె కామెంట్ పెట్టింది. సమంత చిలిపిగా చేసిన ఈ సరదా కామెంట్ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్నాడు.