: చెన్నైలో ముగిసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంత్య‌క్రియ‌లు


అనారోగ్యంతో బాధపడుతూ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ(86) నిన్న చెన్నైలోని తన స్వగృహంలో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ భౌతిక కాయానికి చెన్నైలోని బీసెంట్‌ నగర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయ‌న అంతిమ సంస్కారాల‌కు రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో తాము ప‌నిచేసిన రోజుల‌ని వారు ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుని క‌న్నీరుపెట్టుకున్నారు. సంగీత సామ్రాజ్యంలో ఆయ‌నో ధృవ‌తార అని, ఆయ‌న లేని లోటు పూడ్చ‌లేనిద‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News