: కేపీహెచ్ బీ కాలనీ వద్ద కుంగిపోయిన రోడ్డు


అసలే గుంతలమయంగా ఉన్న రోడ్డు. వాహనాలన్నీ ఒకదాని వెనుక మరొకటి నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. దీంతో, వాహనదారులకు గుండెలు ఆగినంత పనైంది. ఈ ఘటన హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డు (జాతీయ రహదారి) మీద ఉన్న ఉషా ముళ్ళపూడి కమాన్ సమీపంలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ గొయ్యి ఏర్పడటంతో, వాహనాలన్నీ ఆగిపోయి, ట్రాఫిక్ జామ్ అయింది. గొయ్యి చుట్టూ బ్యారికేడ్లు పెట్టిన పోలీసులు, ట్రాఫిక్ ను నియంత్రించే పనిలో పడ్డారు. గతంలో కూడా ఎన్టీఆర్ పార్క్ వద్ద ఇలాంటి ఘటనే జరిగింది. అయితే, అప్పుడు భారీ వర్షాల కారణంగా అది జరిగిందని అందరూ అనుకున్నారు. మరిప్పుడు, రోడ్డు ఎందుకు కుంగిపోయిందో అధికారులే చెప్పాలి.

  • Loading...

More Telugu News