: ‘తృణమూల్’ ఆందోళనలో పాల్గొన్న జయాబచ్చన్
పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయాబచ్చన్ పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో కలిసి ఆమె వేదికపై కూర్చున్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఆదేశాల మేరకే ఈ ఆందోళనలో ఆమె పాల్గొన్నట్లు సమాచారం. కాగా, జయాబచ్చన్ మినహా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలోని వాళ్లందరూ పెద్దనోట్ల రద్దును సమర్ధిస్తుండటం గమనార్హం.