: త‌మిళ, హిందీ సినీ దర్శకుడు, రచయిత కె.సుభాష్ మృతి


అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ త‌మిళ, హిందీ సినీ దర్శకుడు, రచయిత కె.సుభాష్‌ (57) ఈ రోజు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో తుది శ్వాస విడిచారు. ప్రసిద్ధ దర్శకుడు కృష్ణన్‌ కుమారుడయిన ఆయ‌న‌ తమిళంలో పలు విజయవంతమైన సినిమాల‌కు దర్శకత్వం వహించారు. షారుఖ్ ఖాన్‌కు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమాకి సుభాష్‌ కథను అందించారు. ‘సండే’, ‘దిల్‌వాలే’, ‘హౌస్‌ఫుల్ 3’ వంటి ప‌లు సినిమాల‌కు కూడా ఆయ‌నే క‌థా ర‌చ‌యిత‌. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News