: చందన బ్రదర్స్ ఛైర్మన్ ఫోర్జరీ కథ ఇదే...!


ఫోర్జరీ కేసులో చందనా బ్రదర్స్ ఛైర్మన్ రామారావును హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ కుమారుడు కన్నా ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామారావును అరెస్ట్ చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే... కన్నా ఫణీంద్ర తనను బెదిరిస్తున్నారంటూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గతంలో రామారావు ఫిర్యాదు చేశారు. నయీం తెలుసంటూ తనను లేఖలో బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ లేఖకు సంబంధించి పోలీసులు విచారణ జరపగా... లేఖలో ఉన్న ఫణీంద్ర సంతకం ఫోర్జరీ అని తేలింది. తనకు తానే బెదిరింపు లేఖ రాసుకుని, ఫణీంద్రపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో, ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి, రామారావును అరెస్ట్ చేశారు పోలీసులు.

  • Loading...

More Telugu News