: హైదరాబాదు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయం ప్రారంభం


హైదరాబాదు ఆర్టీసీ బస్సులలో ఎయిర్ టెల్ ఉచిత వైఫై సదుపాయం ప్రారంభమైంది. హైదరాబాద్ లో రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రయాణించే 115 మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారు ఎవరైనా రోజుకు 20 నిమిషాల పాటు ఉచితంగా వైఫై సేవలను వినియోగించుకోవచ్చు. ఏ టెలికాం ఆపరేటరు సేవలు వినియోగించుకుంటున్న చందాదారుడైనా, ఈ వైఫై సేవలను ఉచితంగా పొందవచ్చునని అన్నారు. కాగా, భారతీ ఎయిర్ టెల్, టీఎస్ ఆర్టీసీ లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి.

  • Loading...

More Telugu News