: మంగళంపల్లికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాల్సింది తమిళనాడు ప్రభుత్వం!: పల్లె రఘునాథరెడ్డి


ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో మంగళంపల్లి బాలమురళీకృష్ణకు అంత్యక్రియలు నిర్వహించడం కరెక్టు కాదని, ఆ ఏర్పాట్లు చేయాల్సింది తమిళనాడు ప్రభుత్వం అని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. బాలమురళీకృష్ణకు నివాళులర్పించేందుకు చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లిన పల్లె మీడియాతో మాట్లాడుతూ, మంగళంపల్లి మీద ఉన్న అపారమైన గౌరవం వల్లనే సాంస్కృతిక శాఖ తరపున తనను సీఎం చంద్రబాబునాయుడు ఇక్కడికి పంపారని చెప్పారు.అంతేకాకుండా, ఏపీలో బాలమురళీ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తుంచుకుంటామని, జాతి గర్వించదగ్గ మహా వ్యక్తి అయిన ఆయన తెలుగువాడు కావడం గర్వించదగ్గ విషయమన్నారు.

  • Loading...

More Telugu News