: ఎల్లుండి హైద‌రాబాద్‌కు రానున్న ప్ర‌ధాని మోదీ


ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. రానున్న‌ శుక్ర‌, శ‌నివారాల్లో ఆయ‌న న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నట్లు స‌మాచారం. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో నిర్వ‌హించ‌నున్న మూడు రోజుల జాతీయస్థాయి డీజీపీల సమావేశానికి మోదీ హాజ‌రై ప్ర‌సంగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సంబంధిత‌ అధికారులతో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ శర్మ సమీక్ష జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News