: నోట్ల పరిస్థితి గురించి సుప్రీంకోర్టుకు వివరించిన అటార్నీ జనరల్


పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో నెలకొన్న తాజా పరిస్థితిని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వివరించారు. కొత్త కరెన్సీకి కొరత లేదని... అయితే, సరఫరాలోనే కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు సరైన చర్యలను తీసుకున్నామని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకు సుమారు రూ. 6 లక్షల కోట్ల పాత కరెన్సీ బ్యాంకుల్లో జమైందని... మొత్తం రూ. 15 లక్షల కోట్ల వరకు రావలసి వుందని తెలిపారు. రానున్న రోజుల్లో పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News