: ముద్రగడను అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు?
కాపు నేత ముద్రగడ పద్మనాభంను ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త సంచలనం రేకెత్తిస్తోంది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఓ హోటల్ లో ఉన్న ముద్రగడను ఆర్పీఎఫ్ పోలీసులు అనకాపల్లిలోని ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రాత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం కేసులో ముద్రగడను కుట్రదారుడిగా పేర్కొన్న రైల్వే పోలీసులు... అతని నుంచి స్టేట్ మెంట్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే, ముద్రగడను తాము అదుపులోకి తీసుకోలేదని రైల్వే డీఎస్పీ తెలిపారు. కొందరు అనుచరులను తాము పిలవగా... వారితో పాటు ముద్రగడ కూడా వచ్చారని చెప్పారు. ఆకుల రామకృష్ణ, చెల్లా ప్రభాకర్ లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.