: గంభీర్ వెనకాలే సాహా కూడా... ఎనిమిదేళ్ల తరువాత పార్థివ్ పటేల్ కు పిలుపు


ఇంగ్లండ్ తో జరగనున్న మూడవ టెస్టు మ్యాచ్ కి ఇప్పటికే గంభీర్ ను పక్కనబెట్టిన టీమిండియా యాజమాన్యం, కీపర్ వృద్ధిమాన్ సాహానూ తొలగించింది. అతని స్థానంలో ఇటీవలి కాలంలో దేశవాళీ పోటీల్లో రాణిస్తున్న పార్థివ్ పటేల్ ను జట్టులోకి తీసుకుంది. భారత్ తరఫున 2008లో శ్రీలంకతో టెస్టు మ్యాచ్ ఆడిన తరువాత, పార్థివ్ జట్టుకు దూరమయ్యాడు. ఆపై ధోనీ హవా ప్రారంభం కావడంతో, పార్థివ్ అవసరం లేకపోయింది. తిరిగి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తరవాత పార్థివ్ కు పిలుపు రావడం గమనార్హం. 31 సంవత్సరాల పార్థివ్ ఇప్పటివరకూ 20 టెస్టులు ఆడాడు. ఎంతో కాలం పాటు ధోనీ తరవాత వికెట్ కీపర్ రీప్లేస్ మెంట్ గా జట్టుకు సేవలందించాడు. 2012 ఫిబ్రవరిలో చివరి వన్డే ఆడిన తరువాత మరో మారు దేశం తరఫున మైదానంలోకి దిగలేదు. ఇక మూడో టెస్టులో పార్థివ్ రాణిస్తే, తదుపరి వన్డేలకూ పిలుపు వచ్చే అవకాశాలు ఉంటాయని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News