: హైదరాబాద్ బిర్యానీని విద్యాబాలన్ ఇంతవరకు టేస్ట్ చేయలేదట... ఎందుకో తెలుసా?


బాలీవుడ్ భామ విద్యాబాలన్ నిన్న హైదరాబాద్ లో సందడి చేసింది. తాను నటించిన 'కహానీ2' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫోరం సుజనా మాల్ లో హల్ చల్ చేసింది. అభిమానులతో సెల్ఫీలు దిగింది. ఎస్ మార్ట్ లో కొత్త టీవీలను ఆవిష్కరించింది. జూబ్లీ హిల్స్ లోని తక్ష్ రెస్టారెంటులో ఫుడ్ టేస్ట్ చేసింది. ఈ సందర్భంగా, అనేక విషయాలపై ఆమె స్పందించింది. తాను నటించిన 'డర్టీ పిక్చర్', 'బాబీ జాసూస్' సినిమాలను హైదరాబాద్ లోనే షూట్ చేశారని చెప్పింది. హైదరాబాద్ అంటే తనకు ఇష్టమని... ముఖ్యంగా పాతబస్తీలోని పురాతన కట్టడాలు తనను చాలా ఆకట్టుకున్నాయని చెప్పింది. దక్షిణ భారత దేశానికి చెందినదాన్ని కావడంతో, తనకు తెలుగు మాట్లాడటం కొంచెం వచ్చని తెలిపింది. తాను ఇంతవరకు హైదరాబాదీ ఫేమస్ బిర్యానీని రుచి చూడలేదని విద్యాబాలన్ తెలిపింది. తాను నాన్ వెజ్ తినకపోవడమే దీనికి కారణమని చెప్పింది. బాహుబలి-2 సినిమా కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అనే ఆలోచన వస్తేనే టెన్షన్ కలుగుతోందని తెలిపింది. తెలుగులో అవకాశం వస్తే నటించడానికి రెడీ అని... అందులోనూ రాజమౌళితో కలసి పనిచేసే అవకాశం వస్తే ఇంకా సంతోషమని చెప్పింది.

  • Loading...

More Telugu News