: ఏపీకి గుడ్ న్యూస్... ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతకు కేంద్రం ఆమోదం


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ప్యాకేజీకి చట్టబద్ధత నిర్ణయాన్ని వెల్లడించారు. చట్టబద్ధతకు సంబంధించిన ఫైల్ ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖలకు పంపింది. వచ్చే వారం ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్యాకేజీకి చట్టబద్ధత లేకపోతే... రాష్ట్రానికి మరోసారి తీరని అన్యాయం జరుగుతుందని అధికార టీడీపీ నేతలే కాకుండా, విపక్ష సభ్యులు, రాష్ట్ర ప్రజలు భయపడ్డారు. ఈ నేపథ్యంలో, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తున్నట్టు కేంద్రం తెలపడంతో... ఏపీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

  • Loading...

More Telugu News