: నోట్ల రద్దుపై ఇంత లేట్ గా స్పందించడానికి కారణమేంటన్న ప్రశ్నకు జగన్ సమాధానం!
నోట్ల రద్దు తరువాత ఇంత లేటుగా స్పందించడానికి కారణమేంటి? అంటూ భాస్కర్ అనే విలేకరి అడిగిన ప్రశ్నకు వైకాపా అధినేత వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. "ఒక్కటి ఆలోచన చేయాలి భాస్కరన్నా... స్పందించడం అన్నది ఏదైతే ఉందో... సోకాల్డ్ చంద్రబాబునాయుడు గారు తన మంత్రుల చేత చెప్పించడమో కాదు. నెగటివ్ మీడియాలో ఉన్న వాళ్లు రాస్తున్న దాని గురించి నేను ఒకటి చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నాం మేము. వాళ్లు ఏం నిర్ణయం తీసుకుంటున్నారన్నది మీకు తెలియదు, నాకు తెలియదు. మీ మాదిరిగానే నేను కూడా. ఎవరైనా కూడా బ్లాక్ మనీ దీనివల్ల పోతుంది అంటే, ఎవడైనా హర్షిస్తామని చెబుతాడు. కానీ, నిజంగా ప్రతిపక్షం అంటే ఏంటి? వాయిస్ ఆఫ్ ది పీపుల్. ప్రజలందరూ బాగుంది అని అంటే, ప్రజలకు తోడుగా బాగుందని అంటాం. ప్రజలందరూ ఇది బాగోలేదు, వ్యతిరేకించండి అని వాయిస్ ఇస్తే, ప్రజల తరఫున వ్యతిరేకిస్తాం. దటీజ్ ప్రతిపక్షం. ప్రతిపక్షం అన్నది డెసిషన్ తీసుకున్న తరువాత స్పందిస్తుంది. రూలింగ్ పార్టీ డెసిషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ డేనో, సెకండ్ డేనో స్పందించే కార్యక్రమం చేస్తే, అది బుర్ర నుంచి వచ్చిన స్పందన అవదు. స్పందన కరెక్టుగా రిఫ్లెక్ట్ కావాలంటే, ప్రజలు పడుతున్న ఇక్కట్లు, బాధలు తెలుసుకుని, తీసుకున్న నిర్ణయం సరైనదా? కాదా? తెలుసుకుని తరువాత స్పందిస్తే, అది బుర్రలో నుంచి వచ్చే స్పందన. మామూలుగా ఎవరిని అడిగినా... బ్లాక్ మనీ అంతా పోతుందని చెబితే, ఎవుడైనా మంచిదే అబ్బా... ఆలోచన మంచిదే అని ఎవుడైనా హర్షిస్తాడు. కానీ, ఎవరికి తెలుస్తుంది? ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదని? ఎవరికి తెలుస్తుంది, వారు ప్రిపేర్డ్ గా లేరని? మేమేం ప్రభుత్వంలో భాగస్వాములం కాదే... చంద్రబాబునాయుడి క్యాబినెట్లో మేము లేమే. వారేం నిర్ణయాలు తీసుకుంటున్నారో మాకు తెలియదే. ఈ పరిస్థితుల్లో అకాలపు నిర్ణయం వస్తే, ఎవరికైనా ఏం తెలుస్తుంది? ఇవాళ, ప్రతి ఒక్కరినీ అడిగాం... ఊర్లల్లో స్పందన అడిగాం. వారు పడుతున్న బాధలు తెలుసుకున్నాం. ఆపై స్పందిస్తున్నాం" అని జగన్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.