: అనూహ్యంగా పడిపోయిన ఉష్ణోగ్రత్తలు... చంపేస్తున్న చలిపులి!
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో చలిపులి చంపేస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణం కంటే, నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత రాత్రి మెదక్ లో ఉష్ణోగ్రత అత్యల్పంగా 10 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్ లో తెలంగాణకు ఇదే అత్యల్పం. విశాఖ జిల్లా అరకు ప్రాంతంతో పాటు ఆదిలాబాద్ ఏజన్సీలో సైతం కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు చేరాయి. ఈ శీతాకాలంలో సూర్యుని వేడిమి మరింతగా తగ్గవచ్చని, న్యుమోనియా, స్వైన్ ఫ్లూ వంటి రోగాల బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.