: కరవు తీరుతుంది... ప్రత్యేక విమానాల ద్వారా తెలంగాణ, ఏపీలకు వస్తున్న రూ. 500 నోట్లు
తెలుగు రాష్ట్రాల్లో చిల్లర నోట్లకు కొంతమేరకు కష్టం తీరనుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి విమానాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 400 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లు రానున్నాయి. నేటి మధ్యాహ్నం తరువాత ఏ సమయంలోనైనా ఇవి బ్యాంకులకు అందనున్నాయని, వీటిని తీసుకువెళ్లి చలామణిలోకి తెచ్చేందుకు బ్యాంకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంగళవారమే ఉత్తర్వులు అందాయి. ప్రత్యేక విమానాల ద్వారా ఇవి హైదరాబాద్ రిజర్వ్ బ్యాంక్ కార్యాలయానికి రానున్నాయి. ఆపై వివిధ బ్యాంకులకు ఈ నగదును తరలించనున్నారు. చిల్లర లేక ఆందోళనలో ఉన్న బ్యాంకర్లు, ఈ నెల 24వ తేదీ తరువాత బ్యాంకులను నడపే పరిస్థితి లేదని, సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రిజర్వ్ బ్యాంక్ నకు స్పష్టం చేయడంతోనే రూ. 500 నోట్లను యుద్ధ ప్రాతిపదికన తెలుగు రాష్ట్రాలకు పంపుతున్నట్టు తెలుస్తోంది.