: డంకన్ ఫ్లెచర్ చెప్పాడు, పాటించానంటున్న కోహ్లీ!
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ డంకెన్ ఫ్లెచర్ తో మాట్లాడిన తరువాత తాను ఎంతగానో మారిపోయి ప్రొఫెషనల్ ఆటగాడిగా తయారైనట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తనకు ఫిట్ నెస్ విలువను ఆయనే చెప్పాడని అన్నారు. ఒకప్పుడు తాను అతిగా తింటూ, ఆలస్యంగా పడుకునేవాడినని, మానసిక స్థితి సైతం బాగుండేది కాదని, ఇప్పుడున్న బరువుతో పోలిస్తే 12 కిలోల బరువు అధికంగా ఉండేవాడినని చెప్పుకొచ్చిన కోహ్లీ, ఫ్లెచర్ తో మాట్లాడాక, ప్రొఫెషనల్ క్రికెటర్ ఇలా ఉండకూడదని తెలుసుకున్నట్టు చెప్పాడు. ప్రతిభ ఎంతైనా, ఫిట్ నెస్ లేకుంటే, అది ఎక్కువ కాలం నిలవదని అర్థం చేసుకుని, అప్పటి నుంచి ఫిట్ నెస్ పై దృష్టి పెట్టి ప్రొఫెషనల్ గా మారేందుకు కృషి చేశానని చెప్పాడు.