: హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపనులే!: ట్రంప్ అభయం
తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే, డెమోక్రాట్ల అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపిస్తానని ఎన్నికల ముందు చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఓ మెట్టు దిగారు. ఆమెను జైలుకు పంపించబోనని అభయం ఇచ్చారట. ఈ విషయాన్ని ట్రంప్ ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించిన కెల్యాన్నే కాన్వే వెల్లడించారు. ఈ-మెయిల్స్ కేసులో ఆమెను జైలుకు పంపుతానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. హిల్లరీని జైలుకు పంపే ఉద్దేశం ట్రంప్ కు లేదని, ఓటమితో కుంగిపోతున్న హిల్లరీ త్వరగా కోలుకునేందుకు ట్రంప్ సాయం చేస్తారని కాన్వే పేర్కొన్నారు. అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారని తెలిపారు.