: శాస్త్రవేత్తల అద్భుత సృష్టి... ఒకసారి ఛార్జింగ్ చేస్తే వారం పాటు వాడుకోవచ్చు!


అమెరికా శాస్త్రవేత్తలు అద్భుతమైన బ్యాటరీని సృష్టించారు. ఒకసారి చార్జ్ చేసిన శక్తితో కొన్ని వారాల పాటు ఫోన్‌ ను నిరంతరాయంగా పని చేయించగల సామర్థ్యం కలిగిన ‘సూపర్‌ కెపాసిటర్’‌ బ్యాటరీని రూపొందించినట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడా శాస్త్రవేత్త నితిన్‌ చౌధరి తెలిపారు. ఈ సూపర్‌ కెపాసిటర్ ను నానో మీటర్‌ మందంతో ఉన్న లక్షల వైర్లు, 2డీ పదార్థాలతో తయారు చేశామన్నారు. స్మార్ట్‌ ఫోన్లలోని లిథియం బ్యాటరీని ఈ కొత్త సూపర్‌‌ కెపాసిటర్ బ్యాటరీతో రీప్లేస్ చేసుకుంటే కేవలం కొన్ని సెకండ్లలోనే చార్జ్ అవడంతో పాటు వారం రోజుల పాటు చార్జింగ్‌ పెట్టాల్సిన బాధ తప్పుతుందని ఆయన తెలిపారు. సాధారణ లిథియం బ్యాటరీని 1500 సార్లు చార్జ్‌ చేయవచ్చు, అదే 2డీ పదార్థాలతో తయారయిన సూపర్‌ కెపాసిటర్ బ్యాటరీని అంతకు రెట్టింపు సార్లు అంటే 30 వేల సార్లు చార్జింగ్‌ చేయవచ్చని ఆయన వెల్లడించారు. సూపర్‌ కెపాసిటర్ ను అన్ని రకాల ఎలక్ట్రిక్‌ ఉపకరణాలు, ఎలక్ట్రిక్‌ కార్లకు ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News