: గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. ప్రధానితో తన సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన గవర్నర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రజల ఇబ్బందులను వివరించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది.