: పెద్దనోట్ల రద్దును గుండె ఆపరేషన్ తో అభివర్ణించిన మురళీమోహన్!


పెద్దనోట్ల రద్దును గుండె ఆపరేషన్ తో అభివర్ణించారు టీడీపీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీమోహన్. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘ఒకవేళ, నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందనుకోండి, డాక్టరు దగ్గరకు వెళితే ఏమంటారు?.. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, లేకపోతే, చాలా కష్టమని అంటారు. వెంటనే, ఆపరేషన్ చేసేయండి అంటాం, చేసేస్తారు. ఆ తర్వాత డాక్టరు వచ్చి.. ఆపరేషన్ సక్సెస్ అయింది.. వెరీగుడ్ అంటారు. అయితే, డాక్టరు వెళుతూ వెళుతూ ఒక మాట చెబుతారు, 'ఒక నెలరోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది' అని చెబుతారు. ఆ ఇబ్బందులు పడతామని చెప్పి, ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే.. మనిషే చచ్చిపోతాడు. అలాగే, ఈ రోజున నల్లధనాన్ని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలు చాలా మంచివి. అయితే, ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే..కానీ, ప్రతి ఒక్కరూ కూడా భరించాల్సిన అవసరం ఉంది’ అని మురళీమోహన్ అన్నారు.

  • Loading...

More Telugu News