: బాలమురళీకృష్ణతో కలిసి ఆకాశవాణిలో పనిచేశా: గొల్లపూడి మారుతీరావు
ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతిపై పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు బాలమురళీ కృష్ణతో కలిసి ఆకాశవాణిలో పనిచేసిన నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప జ్ఞాపకమని, మంగళంపల్లికి తెలియని గమకాలు లేవని, దేశం గొప్ప సంగీత విద్వాంసుడుని కోల్పోయిందని గొల్లపూడి ఆవేదన వ్యక్తం చేశారు.