: రూ.5.5 కోట్ల రద్దయిన పెద్ద నోట్లను విమానంలో తరలిస్తూ పట్టబడ్డాడు!


ఇటీవలే రద్దయిన నోట్లను మార్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ నల్లకుబేరులు దేశంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులకి పట్టుబడుతున్న సంగతి విదితమే. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు త‌మ వ‌ద్ద ఉన్న పాత‌నోట్ల‌ను త‌ర‌లించ‌డానికి కంటైన‌ర్లు, కార్లు, వ్యాన్‌ల‌ను మాత్ర‌మే ఉప‌యోగించారు. కానీ, తాజాగా ఓ న‌ల్ల కుబేరుడు త‌న వ‌ద్ద ఉన్న పాత‌నోట్ల‌ను త‌ర‌లించడానికి ఏకంగా విమానాన్నే ఉప‌యోగించాడు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో విమానాశ్ర‌యాల్లోనూ భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యక్తి పట్టుబడ్డాడు. చార్టర్డ్‌ ఫ్లైట్‌లో ఈ నోట్ల‌ను తరలిస్తున్న సదరు వ్యక్తిని నాగాలాండ్ విమానాశ్ర‌యంలో ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌లోని ముంగర్‌కి చెందిన సింగ్‌ అనే వ్యాపారవేత్త హరియాణాలోని సిర్సా ప్రాంతం నుంచి చార్టర్డ్‌ ఫ్లైట్‌లో స‌ద‌రు విమానాశ్ర‌యానికి వ‌చ్చాడ‌ని, అత‌డిని విచారించిన సిబ్బందికి ఆ వ్యాపారి వ‌ద్ద రూ.5.5కోట్లు ర‌ద్దైన నోట్లు ఉన్నాయ‌ని తెలిసిందని పోలీసులు తెలిపారు. ఆ న‌గ‌దు ఎవరిది? ఎక్క‌డికి తీసుకెళుతున్నాడు? అనే విష‌యంపై తాము ద‌ర్యాప్తు జరుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News