: 'కహానీ-2' నా కెరీర్ లో అద్భుతమైన సినిమా: విద్యాబాలన్
ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ హైదరాబాదులో సందడి చేసింది. బంజారాహిల్స్ లోని తక్ష్ మల్టీకుజిన్ చైనీస్ రెస్టారెంట్ ను ఆమె సందర్శించింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ లోని రుచులను ఆస్వాదించిన విద్య, వాటి తయారీ విధానాన్ని చెఫ్ లను అడిగి మరీ తెలుసుకుంది. అనంతరం తన తాజా సినిమా 'కహానీ-2' గురించి మాట్లాడుతూ, ఈ సినిమా తన కెరీర్ లో మరో అద్భుతంగా మిగిలిపోతుందని చెప్పింది. గతంలో విజయం సాధించిన 'కహానీ'ని మించిన విజయం సాధిస్తుందని చెప్పింది. ఈ సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.