: బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళల్లో సన్నీలియోన్
బీబీసీ అత్యంత ప్రభావశీల మహిళలు-2016 జాబితాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీలియోన్ చోటు దక్కించుకుంది. హై-ప్రొఫైల్, ప్రభావ శీల మహిళలతో పాటు ఎంటర్ ప్రెనూర్స్, ఇంజనీర్లు, క్రీడారంగం, బిజినెస్, ఫ్యాషన్, సినిమా రంగంలో పేరు ప్రతిష్టలు సంపాదించిన మొత్తం 100 మంది మహిళలతో కూడిన ఈ జాబితాను బీబీసీ నిన్న ప్రకటించింది. కాగా, 35 సంవత్సరాల సన్నీలియోన్ మాజీ పోర్న్ స్టార్. 2013లో బాలీవుడ్ లో కి అడుగుపెట్టింది.