: పార్టీ మత్తులో ఏకంగా సొంత కారునే మర్చిపోయిన పాప్ సింగర్ బీబర్


చిన్నతనంలోనే స్టార్ సెలబ్రిటీ హోదా రావడంతో కెనెడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఇతర సెలబ్రిటీల కంటే కాస్త భిన్నంగా ఉంటాడు. అమ్మాయిలతో తిరగడం, అభిమానులతో గొడవపడడం, తన్నులు తినడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, క్షమాపణలు చెప్పడం.. ఇలా బీబర్ ఖాతాలో చాలా వివాదాలున్నాయి. అలాంటి బీబర్ స్నేహితులతో కలిసి బెవర్లీ హిల్స్ లోని ఓ హోటల్ లో ఫుల్ పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీకి 16 కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మేడ్ ఫెరారీ స్పోర్ట్స్ కారులో వెళ్లాడు. తెల్లవారుజాము 5 గంటల వరకు పార్టీ చేసుకుని స్నేహితుల కారులోనే ఇంటికి చేరుకున్నాడు. తెల్లారాక, తాను ఎవరితో కలసి వచ్చాడో, కారు ఎక్కడ పెట్టాడో అంతా మర్చిపోయాడు. ఎంత ఆలోచించినా గుర్తురాకపోవడంతో తన అసిస్టెంట్ ను పిలిచి కారు వెతికిపెట్టమన్నాడు. దీంతో కారు తాళాలు ఎవరైనా మర్చిపోతారు కానీ, ఏకంగా కారే మర్చిపోతారా? అని ఆశ్చర్యపోయిన ఆమె, చాలా ప్రయత్నించింది. అన్ని ప్రముఖ హోటళ్లకు ఫోన్ చేసి కనుక్కోగా, ఆ కారు తమ హోటల్ దగ్గరే సురక్షితంగా ఉందని, సెలబ్రిటీలు కార్లు వదిలి వెళ్లిపోవడం మామూలేనని, అందుకే తాము సమాచారం అందించలేదని హోటల్ సిబ్బంది తెలిపారు.

  • Loading...

More Telugu News