: బాలమురళితో అనుబంధం కాదు.. బంధుత్వం: కళాతపస్వి కె.విశ్వనాథ్


మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రముఖ సినీ దర్శకుడు విశ్వనాథ్ తెలిపారు. మంగళంపల్లి మరణంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తనకు తీరనిలోటని అన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణతో తనది అనుబంధం కాదని, బంధుత్వమని అన్నారు. తామిద్దరం చిన్నతనంలో పెద్దగా కలుసుకోకపోయినా, విజయవాడలో కాపురమున్న రోజుల నుంచి మంచి స్నేహితులమని ఆయన చెప్పారు. ఈ మధ్యే ఆయనను కలిసినప్పటి నుంచి కాస్త ఆందోళనగానే ఉందని అన్నారు. అయితే, ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని ఆయన చెప్పారు. ఆయనతో పయనం మరచిపోలేని అనుభూతి అని, ఇది శరాఘాతంలాంటి వార్త అని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News