: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఐటీ స్టాక్స్ పుంజుకోవడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 195.64 పాయింట్లు లాభపడి 25,960.78కి పెరిగింది. నిఫ్టీ 73.20 పాయింట్లు పుంజుకుని 8,002.30కి ఎగబాకింది. ఇవాల్టి టాప్ గెయినర్స్... మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (7.95%), శోభా లిమిటెడ్ (7.70%), ఇండియా సిమెంట్స్ (7.42%), ప్రిస్టేజ్ ఎస్టేట్స్ (7.33%), ఫినొలెక్స్ ఇండస్ట్రీస్ (6.59%). టాప్ లూజర్స్... రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-3.96%), ఐఆర్బీ ఇన్ ఫ్రా (-3.64%), డెన్ నెట్ వర్క్స్ (-3.47%), జీవీకే పవర్ అండ్ ఇన్ ఫ్రా (-3.30%), ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్ (-3.26%).