: మోదీ నిర్ణయం ఇల్లు తగులబెట్టుకున్నట్టు ఉంది: గాలి ముద్దుకృష్ణమ


పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. శివసేన నేరుగా ప్రధానిని విమర్శిస్తుండగా, మరో మిత్రపక్షమైన టీడీపీ నేతలు కూడా నెమ్మదిగా విమర్శలు ప్రారంభిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు హైదరాబాదులో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం ఇంట్లోకి ఎలుక వచ్చిందని, ఇల్లు తగులబెట్టుకున్నట్టు ఉందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినప్పటికీ రహస్యంగా ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులకు ముందుగా చిన్న నోట్లు పంపించి ఉంటే సమస్య ఏర్పడి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. స్విస్ బ్యాంకులోని నల్లధనం భారత్ కు రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంపై సీఎంలు, కేంద్రమంత్రులు, ఆర్బీఐ గవర్నర్‌ తో కమిటీ వేయాలని ఆయన సూచించారు. నగదు ఉపసంహరణలో నిబంధనలు సరికాదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News