: ‘పెద్ద‌ నోట్ల ర‌ద్దును ఉప‌సంహ‌రించుకోవాలి’.. రేపు ఢిల్లీలో ధ‌ర్నాకు దిగ‌నున్న మ‌మ‌తాబెన‌ర్జీ


పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్న టీఎంసీ అధినేత్రి, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ రేప‌టి నుంచి పోరాటానికి దిగ‌నున్నారు. పెద్ద‌ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని మూడు రోజుల్లోగా ఉప‌సంహ‌రించుకోవాల‌ని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగుతామ‌ని ఇటీవ‌ల కేజ్రీవాల్ తో కలిసి ఢిల్లీలో నిర్వ‌హించిన స‌భ‌లో ఆమె తెలిపిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆమె రేప‌టి నుంచి ఆందోళ‌న‌కు దిగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ధర్నా నిర్వహించనున్నట్టు ఈ రోజు మీడియాకు తెలిపారు. మ‌రోవైపు రేపు త‌మ రాష్ట్ర‌ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News