: ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే: ఉద్దవ్ థాకరే డిమాండ్
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి నేటికి 14 రోజులు ముగుస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదు సరికదా మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి. బీజేపీ మిత్ర పక్షం శివసేన కూడా విపక్షాలతో గొంతు కలిపింది. నోట్ల రద్దుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి విమర్శలు చేశారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, నోట్ల రద్దుపై ప్రధాని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. తాము కోరుతున్నది నోట్ల రద్దుపై మాట్లాడడం కాదని... అమలు, పర్యవసానాలు, చర్యలపై మాట్లాడాలని కోరుతున్నామని ఆయన అన్నారు.