: అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్
దేశ వ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్ల కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తాజాగా ఓ ఆఫర్ ప్రకటించింది. తమ వినియోగదారులు నెలకు రూ.149తో రీఛార్జ్ చేసుకొని, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చని, అంతేగాక 300 ఎంబీ డేటాను కూడా ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ఈ సదుపాయం తమ 2జీ, 3జీ, 4జీ వినియోగదారులందరూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లక్షల మంది కస్టమర్లు ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్ నే వినియోగిస్తున్నారని సంస్థ ఈ సందర్భంగా చెప్పింది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ నెట్‌వర్క్‌కు కొత్తగా వచ్చే వారు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.