: అగ్ని-1 క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం


750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-1 క్షిపణిని భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని వీలర్ ఐలాండ్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆఫ్ కమాండ్ ఈ పరీక్షలు నిర్వహించింది. పరీక్ష సందర్భంగా డమ్మీ వార్ హెడ్ ను మిస్సైల్ కు అనుసంధానించారు. ఈ మిస్సైల్ 500 కిలోల వార్ హెడ్ ను మోసుకుపోగలదు. ఈ మిస్సైల్ ను డీఆర్డీవో తయారుచేసింది. దీని బరువు 12 టన్నులు కాగా... పొడవు 15 మీటర్లు. కేవలం 10 నిమిషాల్లోనే ప్రయోగం ముగిసింది. మిస్సైల్ ప్రయోగాన్ని నేవీ నౌకలు, ఎలెక్ట్రో ఆప్టికల్ పరికరాలు, రాడార్స్, టెలిమెట్రీ అబ్జర్వేషన్ ల సాయంతో పరిశీలించారు. బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని అగ్ని-1 కచ్చితత్వంతో చేరుకుంది.

  • Loading...

More Telugu News