: ఆ యాప్ లో పెద్దనోట్ల రద్దుపై ప్రజలను పది ప్రశ్నలు అడుగుతున్న ప్రధాని మోదీ
పెద్దనోట్లను రద్దు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎన్‌ఎం (నరేంద్ర మోదీ) యాప్ (http://nm4.in/dnldapp)లో ఓ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో భాగంగా మోదీ ప్రజల ముందు పది ప్రశ్నలు ఉంచారు. వాటికి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని అరికడుతుందని ప్రజలు భావిస్తున్నారా? పెద్దనోట్ల రద్దుపై మీరు ఏమనుకుంటున్నారు? నల్లధనం, నకిలీనోట్లు, ఉగ్రవాదాన్ని పెద్దనోట్ల రద్దుతో అరికట్టవచ్చని భావిస్తున్నారా? అనే ప్రశ్నలతో యాప్‌లో ఓ ఫీచర్‌ని రూపొందించారు.