: ఆర్బీఐ గవర్నర్ ఓ శాడిస్టు... ఆయన్ని పదవి నుంచి తప్పించాలి: సీపీఐ నారాయణ


ఆర్బీఐ గవర్నర్ ఓ శాడిస్టు అని, ఆయన్ని పదవి నుంచి తప్పించాలని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ తిరుపతిలోని ఎస్ బీఐ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు సీపీఐ కార్యకర్తలు ధర్నాకు దిగారు. అనంతరం బ్యాంకు ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ, ముందుచూపు లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. దీనిపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కాగా, రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News