: జర్నలిస్టులను పిలిచి మరీ చీవాట్లు పెట్టిన ట్రంప్


ఎవరెన్ని అనుకున్నా... అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు. 'మీటింగ్ ఆఫ్ మైండ్స్' పేరుతో న్యూయార్క్ లో నిన్న ఓ సమావేశానికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖులు, జర్నలిస్టులను ట్రంప్ ఆహ్వానించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు నిజాయతీ లేని వ్యక్తులు, అబద్ధాలకోరులు, వంచకులు అంటూ తిట్ల దండకాన్ని అందుకున్నారు. దీంతో, జర్నలిస్టులంతా అవాక్కయ్యారు. మీ ప్రేక్షకులకు కచ్చితమైన సమాచారాన్ని అందించడంలో మీరు విఫలమయ్యారంటూ విరుచుకుపడ్డారు. అమెరికన్లకు తాను చేసిన విన్నపాలను అర్థం చేసుకోవడంలో జర్నలిస్టులు విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల ప్రచారం సమయంలో మీడియా పదేపదే పక్షపాతపూర్వకంగా వ్యవహరించిందని చెప్పారు. అయితే, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మీడియాతో డొనాల్డ్ ట్రంప్ సన్నిహితంగా మెలుగుతారని భావించినప్పటికీ... ఆయన ఘర్షణ వైఖరినే అవలంబిస్తున్నారని పలువురు జర్నలిస్టులు అంటున్నారు.

  • Loading...

More Telugu News