: ఉగ్రవాదుల వద్ద కొత్త రూ.2000 నోట్లు.. ఆశ్చర్యపోతున్న అధికారులు!


పెద్దనోట్ల రద్దుతో నల్లధనంతో పాటు ఉగ్ర‌వాదాన్ని కూడా మ‌ట్టుబెట్ట‌వ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, దేశంలో కొత్తగా తీసుకొచ్చిన రూ.2000 నోట్లు తీవ్ర‌వాదుల వ‌ద్ద క‌న‌ప‌డ్డాయి. 500 రూపాయల నకిలీ నోట్లను ముద్రిస్తూ వాటిని దేశంలోకి తీసుకొచ్చి, భారత ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం, వాటిని ఉపయోగిస్తూ సరిహద్దు ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు ప్రవేశించడం వంటి చర్యలకు కొత్తగా తీసుకొచ్చిన నోట్లతో కళ్లెం వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే, ఈ రోజు ఉద‌యం జమ్ముకశ్మీర్ బండీపురాలోని హంజన్ ప్రాంతంలో భార‌త జ‌వాన్లు ఇద్దు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను కాల్చి చంపిన అనంత‌రం వారి నుంచి ప‌లు ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో రెండు ఏకే-47 తుపాకులు, తూటాలు, ఆయుధ సామగ్రితో పాటు కొత్త 2000 రూపాయ‌లు కూడా ఉన్నాయి. ప‌లు వంద రూపాయల నోట్లను కూడా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ రూ.2 వేల నోట్లు నకిలీవా? లేక భారత్ తయారుచేసిన అసలైన నోట్లేనా? అనే అంశాన్ని అధికారులు ప‌రిశీలిస్తున్నారు. రెండు వేల రూపాయ‌ల నోటును విడుద‌ల చేసిన కొన్ని రోజుల్లోనే అవి తీవ్రవాదుల చేతుల్లోకి వ‌చ్చిన అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News