: ‘ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి’.. భావోద్వేగ ప్రసంగం చేసిన నరేంద్ర మోదీ


దేశంలోని అవినీతిని నిర్మూలించేందుకు చేస్తోన్న పోరాటంలో పెద్దనోట్ల రద్దు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింత పోరాటం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ... మరోసారి భావోద్వేగ ప్రసంగం చేశారు. తాము తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల‌కు చేకూరే ప్ర‌యోజ‌నాల‌ను బీజేపీ ఎంపీలు వివ‌రించి చెప్పాల‌ని ఆయ‌న సూచించారు. ఈ స‌మావేశంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి మద్దతు పలుకుతూ, మోదీకి అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రవేశపెట్టారని కేంద్రమం‍త్రి వెంకయ్యనాయుడు స‌మావేశం అంనంత‌రం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

  • Loading...

More Telugu News